పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘OG’ మూవీ హిట్ అందుకుంది. సెప్టెంబర్ 25న రిలీజైన ఈ సినిమా 11 రోజుల్లో రూ.308 కోట్లకుపైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. దీంతో పవన్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఇది నిలిచింది.