PLD: కల్తీ మద్యంపై జగన్ చేస్తున్న విషప్రచారం ఆయన స్వప్రయోజనాల్లో భాగమేనని ఎమ్మెల్యే పుల్లారావు ఇవాళ చిలకలూరిపేటలో విమర్శించారు. ములకలచెరువు ఘటనపై ప్రభుత్వం వేగంగా స్పందించి, ఆరోపణలు వచ్చిన వెంటనే టీడీపీ నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేసిందని తెలిపారు. 2022లో జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం మరణాలపై మాజీ సీఎం జగన్ అసెంబ్లీలో సహజ మరణాలుగా చిత్రీకరించడాన్ని గుర్తుచేశారు.