ADB: జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికలో మెజార్టీ స్థానాల్లో గెలుపొందేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రం బీజేపీ పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు పలువురు అభ్యర్థులు ఉత్సాహాన్ని చూపుతున్నారని అన్నారు.