CTR: ది అపోలో యూనివర్శిటీ విద్యార్థి డి. రెడ్డి జీశ్ణు దేశస్థాయిలో అరుదైన గౌరవాన్ని సాధించారు. జాతీయ సేవా పథకం (ఎన్.ఎస్.ఎస్) 2022–23 సంవత్సరానికిగాను వాలంటీర్ విభాగంలో జాతీయ స్థాయి ఉత్తమ సేవా పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా న్యూ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సోమవారం స్వీకరించారు.