మధ్యప్రదేశ్‌లో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. బదిలీపై వెళ్తున్న సియోని కలెక్టర్ సంస్కృతి జైన్‌కు జిల్లాలోని ప్రజలు, సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. ఆమెను, ఇద్దరు కుమార్తెలను పల్లకిలో కూర్చోబెట్టి భుజాలపై మోస్తూ వాహనం వద్దకు తీసుకెళ్లి వీడ్కోలు పలికారు. తన సేవలతో ప్రజలు, సిబ్బంది గుండెల్లో సంస్కృతి జైన్ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.