BDK: కొత్తగూడెం మండలం బోడగుట్టకు చెందిన ఖలీల్ పాషా బస్టాండ్ ప్రాంతంలోని ఆర్టీసీ బంక్ వద్ద సోమవారం సాయంత్రం జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ట్రాఫిక్ ఎస్సై గడ్డం ప్రవీణ్ కుమార్ తక్షణమే స్పందించి ఖలీల్ పాషాను తన వాహనంలో ఆస్పత్రికి తీసుకుని వెళ్లి అక్కడ ప్రథమ చికిత్స చేయించారు.