అన్నమయ్య: రాయచోటి పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆధ్వర్యంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)” నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ఎస్పీ స్వయంగా విని, సంబంధిత అధికారులకు తక్షణ చర్యల ఆదేశాలు జారీ చేశారు. అనంతరం ప్రజల సమస్యల పరిష్కారంలో పోలీసులు జవాబుదారీతనం చూపాలని ఆయన సూచించారు.