KMR: జైల్లో ఉన్న ఖైదీల ప్రవర్తనలో తగిన మార్పులు రావలసిన అవసరం ఎంతైనా ఉందని KMR జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో గల జైలును ఆమె సందర్శించారు. అందులో ఉన్న వంటగదితో పాటు ఇతర గదులను పరిశీలించారు. జైల్లో ఉన్న ఖైదీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. న్యాయపరమైన చట్టాలపై అవగాహన కల్పించారు.