W.G: ఆరోగ్యవంతమైన మహిళతో శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది అని ఎంపీడీవో స్వాతి తెలిపారు. కాళ్ళ మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా స్థూలకాయం నివారణకు చక్కెర, నూనె తగ్గించాలని తెలిపారు. శిశు, చిన్న పిల్లల అలవాట్లు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఆకివీడు సీడీపీఓ వాణీ విజయరత్నం పాల్గొన్నారు.