TPT: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు జిల్లాకు రానున్నారు. మంగళవారం ఉదయం 9 గంటలకు ఉండవల్లి నుండి హెలికాప్టర్లో బయలుదేరి 11 గంటలకు రంగంపేటలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నుండి రోడ్డు మార్గంలో నారావారిపల్లె చేరుకుంటారు. ఆయన తమ్ముడు దివంగత రామ్మూర్తి నాయుడు సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొంటారు.