NLR: మధ్యప్రదేశ్లో కోల్డిఫ్ దగ్గు మందు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నెల్లూరు ఔషద నియంత్రణ శాఖ ఏడీ రమేశ్ రెడ్డిని ఫోన్లో సంప్రదించగా.. కోల్డిఫ్ దగ్గు మందు నెల్లూరు జిల్లాలో లేదన్నారు. ఆ మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.