TPT: పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో సోమవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన జీఎస్టీ 2.0 సంస్కరణల అమలు కార్య క్రమంలో భాగంగా ‘రాష్ట్రవ్యాప్తంగా ఒక నెల ఉత్సవాలు’ కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ మంజునాథ్ గౌడ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని సెలూన్లు, స్పా షాపులను సందర్శించి జీఎస్టీ ధరల మార్పు కరపత్రాలను పంపిణీ చేశారు.