మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారిపై ఉన్న ఐటీఐ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒక లారీ, బైక్ను ఢీ కొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్నవారిలో ఒకరు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.