సత్యసాయి: అమరాపురంలో వెలసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవస్థానం నిర్వహణ బాధ్యతలను ఆర్యవైశ్య సంఘానికి దేవాదాయ శాఖ అప్పగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అనుమతి పత్రాలను సోమవారం వారికి అందజేశారు. ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎమ్మెల్యేను సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్య వైశ్యులు భక్తి భావంతో దేవస్థానం అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.