WGL: నల్లబెల్లి మండలంలో ప్రతి సోమవారం జరిగే అంగడీలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. మెయిన్ రోడ్డు రెండు వైపులా దుకాణదారులు రోడ్డును ఆక్రమించి విక్రయాలు చేస్తుండగా, కొనుగోలుదారుల బైక్ పార్కింగ్తో రద్దీ పెరుగుతోంది. లారీ, RTC బస్సులు వచ్చినప్పుడు డివైడర్ అడ్డుతో వాహనాలు నిలిచిపోతున్నాయి. దీంతో అంగడీని గ్రామ శివారు ప్రభుత్వ భూమికి తరలించాలని ప్రజలు కోరారు.