SKLM: పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల తుఫాన్ కారణంగా రైతులు ఎదుర్కొన్న పంటనష్టం వివరాలు, గత 15 నెలలుగా మంజూరైన రహదారి పనుల పురోగతిపై ఆమె సమీక్షించారు. అదనంగా ఎరువుల పంపిణీ, వ్యవసాయ సదుపాయాలపై అధికారులతో చర్చించారు. ప్రజలకు అవసరమైన సదుపాయాలు వేగంగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.