SRPT: చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జాజిరెడ్డిగూడెం మండలం సీతారాంపురం గుట్టలో సోమవారం చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోటపేటకి చెందిన పూసల బద్రి (45) తిరుమలగిరిలో దిష్టిబొమ్మలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. కారణాలు తెలియదుకానీ ఇవాళ సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.