SRPT: తిరుమలగిరి మున్సిపాలిటీలోని 5వ వార్డు మాలిపురంకి చెందిన కానిస్టేబుల్ వేముల నాగరాజు, కార్తీక్ ఇద్దరు అన్నదమ్ములు రోడ్డు ప్రమాదంలో మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కిశోర్ సోమవారం వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.