కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS)లో భాగంగా మచిలీపట్నంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ డీ.కే.బాలాజీ సోమవారం ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకున్నారు. అర్జీల రూపంలో అందిన సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన ఈ సందర్భంగా సంబంధిత అధికారులకు ఆదేశించారు.