KNR: బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్ ఫీజు నిధులను విడుదల చేయాలని కోరుతూ గంగాధరలో విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని కలిశారు. ఫీజులు చెల్లించే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నామని, నిధులు మంజూరు అయ్యేలా చొరవ తీసుకోవాలని వినతి పత్రం అందించారు.