ATP: పెద్దవడుగూరు మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన వీరభద్ర స్వామి దేవాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. పార్టీ నాయకులు, దేవాలయ కమిటీ సభ్యులతో కలిసి వీరభద్ర స్వామి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆయనను ఆశీర్వదించారు.