కృష్ణా: కనకదుర్గ అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి నిమజ్జనానికి అధిక డీజే బాక్సులను పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదు. ఇదేమని ప్రశ్నించిన కానిస్టేబుల్ విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి డీజే వాహనాన్ని సీజ్ చేసినట్లు చల్లపల్లి ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం అయన పాల్గొని మాట్లాడారు.