AP: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ‘నా జీవితంలో ఎక్కువ ఆనందాన్ని ఇచ్చే ఏకైక కార్యక్రమం స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డుల పంపిణీ. సూర్యుడైనా ఆలస్యంగా వస్తాడేమో కానీ, పారిశుద్ధ్య కార్మికులు సమయానికి వచ్చి రోడ్లన్ని శుభ్రంగా ఉంచుతున్నారు. అలాంటి వారిని మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది’ అని సీఎం అన్నారు.