KMR: జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం IDOC మీటింగ్ హాల్లో రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024-25 సీజన్‌కు సంబంధించి బకాయి ఉన్న CMR (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను నవంబర్ 12 లోగా పూర్తి చేయాలని మిల్లర్లను కలెక్టర్ ఆదేశించారు. ప్రతి మిల్లును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రోజువారీ విజిట్ చేయాలని సూచించారు.