NLR: స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం మెప్మా 4వ సమాఖ్యా ఖాజా నగర్లో టెర్రర్స్ గార్డెన్‌కు అవార్డు వరించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలోని తిక్కన భవన్లో కలెక్టర్ హిమాన్షు శుక్లా, కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి చేతులమీదుగా మెప్మా అధికారులు అవార్డును అందుకున్నారు. మెప్మా సిబ్బందిని అభినందించారు.