TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాము గెలుస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. ఒకటి రెండు రోజుల్లో జూబ్లీహిల్స్ అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. అనంతరం నియోజకవర్గంలో బస్తీబాట నిర్వహిస్తామన్నారు. అక్టోబర్ నెలాఖరులో కామారెడ్డి సభ ఏర్పాటు చేస్తామన్నారు. డిసెంబర్ నెలాఖరుకల్లా కార్పొరేషన్ పదవులను భర్తీ చేస్తామని తెలిపారు.