NRML: అక్రమంగా అమ్ముతున్న తెల్ల కల్లును ఎక్సైజ్ అధికారులు ధ్వంసం చేసిన ఘటన సోమవారం మామడ మండలంలో జరిగింది. ఎక్సైజ్ సీఐ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని తాండ్ర గ్రామంలో అక్రమంగా కల్లు అమ్ముతున్న విషయం దృష్టికి రాగా దాడి చేసి 46.8 లీటర్ల కళ్ళు ధ్వంసం చేయడం జరిగిందని, కళ్ళు అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.