VSP: VMRDA సమావేశ మందిరంలో సోమవారం మాస్టర్ ప్లాన్ 2041పై సమీక్ష జరిగింది. చైర్మన్ ఎం.వి. ప్రణవ్ గోపాల్, మెట్రోపాలిటన్ కమిషనర్ కె.ఎస్. విశ్వనాధన్ సూచనలు ఇచ్చారు. గత పాలకుల తప్పిదాలను పరిగణించి, ప్రజల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాల్సిన ఆదేశం జారీ చేశారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె. రమేశ్, కార్యదర్శి మురళీ కృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.