SKLM: శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్ప పేటలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ను సోమవారం మత్స్యకారుల సంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. మత్స్యకారుల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కారం దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార నేతలు పాపయ్య, రమేష్ ఉన్నారు.