KNR: ప్రజల భద్రత, రహదారి రద్దీ నియంత్రణ లక్ష్యంగా గంగాధర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఎస్సై వంశీ కృష్ణ ఆధ్వర్యంలో పలు వాహనాలను తనిఖీ చేశారు. ప్యాసింజర్ వాహనాలు, ఆటో రిక్షాలు, ఇతర రవాణా వాహనాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. వాహనాలు సురక్షితంగా, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడం ఈ ‘తనిఖీ నివేదిక’ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు.