MDK: అల్లాదుర్గం మండలంలో అక్రమంగా తరలిస్తున్న 60 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా అక్రమంగా వాహనంలో తరలిస్తున్న 60 బస్తాల బియ్యం పట్టుబడినట్లు వివరించారు. బియ్యం, వాహనం అల్లాదుర్గం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు.