మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్తాన్ ప్లేయర్ సిద్రా అమీన్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో సిద్రా ఔటైన సందర్భంగా బ్యాట్‌ను పిచ్‌కేసి కొట్టింది. దీంతో ఆమె ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ ఒక డీమెరిట్ పాయింట్‌ను విధించింది. కాగా, భారత్‌తో మ్యాచ్‌లో ఆమె 81 పరుగులతో హైస్కోరర్‌గా నిలిచింది.