VZM: రేపు శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమాను పండుగ నేపథ్యంలో కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 10:30కు సిరిమాను రథం హుకుంపేటలో బయలుదేరి అమ్మవారి గుడి చేరుకోవాలన్నారు. అక్కడ రథం ఏర్పాట్లను పూర్తి చేసి మూడు గంటలకు సిరిమాను ప్రారంభించాలని సూచించారు. సిరిమాను సాపీగా తిరిగే విధంగా అన్ని చర్యలు తీసుకున్నమని వివరించారు.