BDK: చర్ల మండలం బీఎస్ రామయ్య భవన్లో సోమవారం జరిగిన సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొలగాని బ్రహ్మచారి పాల్గొని మాట్లాడారు. బీజేపీకి వ్యతిరేకంగా కలిసివచ్చే వామపక్ష ప్రజాతంత్ర లౌకిక పార్టీలతో స్థానిక ఎన్నికల అవగాహన కుదుర్చుకుంటామని అన్నారు. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ కొంత గందరగోళంగా ఉందని ఆయన తెలిపారు.