MHBD: రైతులందరూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం అమ్మాలని ఎమ్మెల్యే మురళి నాయక్ అన్నారు. గురువారం మహబూబాబాద్ మండలం కంబాలపల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. రైతులు సకాలంలో కేంద్రానికి ధాన్యాన్ని తీసుకువచ్చి, ప్రభుత్వం అందించే మద్దతు ధర, బోనస్ పొందాలని సూచించారు.