పెద్దపల్లి జిల్లాలో సదరం యూడీఐడీ క్యాంపులు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు అదనపు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్ తెలిపారు. ఈనెల 17, 24, 28, 29 తేదీల్లో గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో వివిధ కేటగిరీల దివ్యాంగులకు క్యాంపులు ఉంటాయన్నారు. హాజరయ్యే వారు పూర్తి వివరాలతో రావాలని సూచించారు. ఎవరైనా డబ్బు అడిగితే తమకు తెలియజేయాలన్నారు.