NLR: నగరంలోని సంతపేట మార్కెట్‌ను మంత్రి నారాయణ పరిశీలించారు. వ్యాపారులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. అగ్నిప్రమాదం గురించి తనకు తెలియగానే అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానన్నారు. ప్రమాదానికి గురైన దుకాణాలను పరిశీలించినట్లు ఆయన తెలిపారు. బాధితులకు పరిహారం కూడా త్వరలోనే అందజేస్తామని వెల్లడించారు.