ADB: కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురిసి పంట నష్టంతో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు జిల్లాను విపత్తు ప్రభావిత ప్రాంతంగా ప్రకటించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. సోమవారం పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి కలెక్టర్ రాజర్షిషాకు వినతి పత్రాన్ని అందజేశారు.