BHNG: ఎన్నికల నిర్వహణలో పోలింగ్ అధికారుల పాత్ర అత్యంత కీలకమని భువనగిరి ఆర్డీవో కృష్ణారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆత్మకూర్(ఎం) మండలంలోని అన్ని గ్రామాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా ఎన్నికల సిబ్బంది పూర్తి బాధ్యత వహించాలని సూచించారు.