SKLM: విద్యార్థుల శారీరిక, మానసిక అభివృద్ధికి సమతుల్య ఆహారం అత్యంత ముఖ్యమని రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ విజయ ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం సోంపేట, బారువ, కంచలి, మందస మండలాల్లోని పలు పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలలో ఆకస్మిక తనిఖి నిర్వహించారు. మధ్యాహ్నం భోజన పథకం అమలుతీరు పరిశీలించారు. ఆహార నాణ్యతలో రాజీ పడకూడదని ఆదేశించారు.