AP: స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర అవార్డులను CM చంద్రబాబు పంపిణీ చేశారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సంస్థలు, వ్యక్తులకు ఈ అవార్డులను అందించారు. రాష్ట్ర స్థాయిలో 21 కేటగిరీల్లో 69 అవార్డులు అందజేశారు. స్వచ్ఛ మున్సిపాలిటీలు, స్కూళ్లు, ఆస్పత్రులు, బస్స్టేషన్లు, పరిశ్రమలకు జిల్లా స్థాయిలో 1,257 మందికి ఈ పురస్కారాలు అందించారు.