KMR: BRS హయాంలో మైనర్ ప్రాజెక్టులపై చిన్నచూపు చూడడంతోనే ప్రస్తుత వరదలకు కారణమని ఎల్లారెడ్డి MLA మదన్ మోహన్ పేర్కొన్నారు. సీఎం నాయకత్వంలో ఎల్లారెడ్డిని అభివృద్ధి చేసుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు హైదరాబాద్లోని గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా భారీ వర్షాలు, వరదలతో తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.