VSP: జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కె.కె. రాజు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం సోమవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేస్తోందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, విద్యారంగ నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు చేశారు. అక్టోబర్ 9న నర్సీపట్నం వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.