ELR: నూజివీడులోని శ్రీ కోట మహిషాసురమర్దిని అమ్మవారి ఆలయంకు దసరా మహోత్సవాలలో భాగంగా రూ. 7,02,620 ల ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో అలివేణి సోమవారం తెలిపారు. ఆలయ ఆవరణలో హుండీ లెక్కించగా హుండీ ఆదాయం రూ.3,30,656లు రాగా, టిక్కెట్ల విక్రయం ద్వారా డొనేషన్ల ద్వారా రూ. 3,71,964లు వచ్చినట్లు పేర్కొన్నారు. హుండీ లెక్కింపును గన్నవరం ఇన్స్‌స్పెక్టర్ అనురాధ పర్యవేక్షించారు.