ప్రకాశం: ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా సోమవారం ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 66 మంది ఫిర్యాదులను ఎస్పీ పరిశీలించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడారు. అనంతరం వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.