SKLM: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఎమ్మెల్యే గోండు శంకర్ రావు ఆవిష్కరించారు. సోమవారం శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సుమారు 18 పరిశ్రమల వారు పాల్గొంటున్నారన్నారు.