RR: రాజేంద్రనగర్ లోని ప్రొ. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించనున్న పీజీ (రెగ్యులర్, ప్రత్యేక కోటా), PHD కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు దాఖలు చేసుకునే గడువుని పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ డా. విద్యాసాగర్ తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో 12వ తేదీ వరకు చేసుకోవచ్చన్నారు.