AKP: కోటవురట్లలో కవయిత్రి ఆతుకూరి మొల్ల విగ్రహాన్ని కోనసీమ జిల్లా శాలివాహన కమ్యూనిటీ డైరెక్టర్ విజయ కుమారి, టీడీపీ నాయకులు జానకి శ్రీను, జానకి హరి సోమవారం ఆవిష్కరించారు. సంస్కృత భాషలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలోకి మొల్ల అనువదించినట్లు జానకి శ్రీను తెలిపారు. ఆమె తెలుగు సాహిత్యంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు.