ప్రకాశం: గిద్దలూరు మండలంలోని ముండ్లపాడులో గ్రామ సచివాలయాన్ని మండల ఎంపీడీవో సీతారామారావు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు రికార్డులను పరిశీలించి సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. సచివాలయాలకు తమ సమస్యలపై వస్తున్న ప్రజలకు పూర్తి సహకారం అందించాలని, వారి సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని సిబ్బందికి సూచించారు.