KDP: ప్రొద్దుటూరు మండలం కల్లూరులో రూ.30 లక్షల వ్యయంతో నిర్మించనున్న రామాలయం కోసం స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సోమవారం భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హిందూ ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని, ఆలయాల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు.